DR.B.R.AMBEDKAR KONASEEMA DISTRICT
DR.B.R.AMBEDKAR KONASEEMA DISTRICT
konaseema
2024-12-01
ఈనెల 11వ తేదీ మండపేట ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ మీటింగ్ మండపేటలో నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోస్టల్ ఇన్సూరెన్స్ ను ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిందిగా కార్యవర్గ సభ్యులు తమ అసోసియేషన్ సభ్యులకు తెలియజేయడం జరిగింది. దీనికి స్పందించి మండపేట అసోసియేషన్ తమ ఖర్చుతో అసోసియేషన్ లోని 92 మంది సభ్యులకు నిన్న ఒక్కరోజే పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. తెల్లవారుజామున షూటింగ్ ముగించుకుని ప్రయాణం చేయుచున్న మన సభ్యులను కొంతమందిని కోల్పోవడం జరిగింది. వారికి మన సభ్యులు అందించిన చేయూత తప్ప ఏ విధమైన ఆర్థిక సహాయం అందలేదు ఈ విషయంపై అన్ని కార్యవర్గ సభ్యులు తమ సభ్యులకు పోస్టల్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయించుకోమనడం జరుగుతోంది. ఒకేసారి ఇం తమంది సభ్యులు పోస్టల్ ఇన్సూరెన్స్ చేసుకోవడం మంచి నిర్ణయం అని ఇంకా చాలామంది కి విషయాన్ని తెలిపి ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సిందిగా తెలియజేయాలని మండపేట పోస్టల్ అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇంతమందికి ఒకేసారి ఇన్సూరెన్స్ చేయించిన మండపేట అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస రెడ్డి మరియు కార్యవర్గానికి ప్రత్యేక అభినందనలు తెలియ జేశారు.
Read More