DR.B.R.AMBEDKAR KONASEEMA DISTRICT
DR.B.R.AMBEDKAR KONASEEMA DISTRICT
konaseema
2025-10-16
ఎస్పీ శ్రీ రాహుల్ మీనా, ఐపీఎస్ చేతుల మీదుగా QR కోడ్ లింక్ ఆవిష్కరణ. అమలాపురం: డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తమ వృత్తి నిపుణుల భద్రత కోసం సేఫ్టీ ఐడీ స్టిక్కర్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించే లక్ష్యంతో రూపొందించిన ఈ QR కోడ్ లింక్‌ను జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ శ్రీ రాహుల్ మీనా, ఐపీఎస్ గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్యూఆర్ కోడ్ ఆధారిత స్టిక్కర్‌ను ఫోటోగ్రాఫర్లు తమ వాహనాలపై (బైక్/కారు) అతికించుకోవాల్సి ఉంటుంది. ప్రమాదం లేదా అత్యవసర సమయంలో, ఎవరైనా ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే, ఆ వ్యక్తి యొక్క ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్, బ్లడ్ గ్రూప్ వంటి కీలక వివరాలు తక్షణమే అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు వేగంగా సహాయం అందించే అవకాశం ఉంటుంది. వృత్తిపరమైన సందేహాలు లేదా తనిఖీలలో పోలీసులకు కూడా ఈ వ్యవస్థ సహకరిస్తుంది. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు ఎస్పీ శ్రీ రాహుల్ మీనా గారిని ఘనంగా సన్మానించారు. ఎస్పీ మాట్లాడుతూ, "టెక్నాలజీని ఉపయోగించి ఫోటోగ్రాఫర్లు తమ భద్రత కోసం తీసుకున్న ఈ ముందుచూపు చాలా అభినందనీయం. ఈ వినూత్న వ్యవస్థ పోలీసులకు కూడా తనిఖీలలో సహకరిస్తుంది," అని కొనియాడారు. అసోసియేషన్ సభ్యులందరూ దీన్ని తప్పక వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కల్వకొలను తాతాజీ,జిల్లా అధ్యక్షులు గెడ్డం సురేష్ కుమార్, సెక్రటరీ దొరబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గీత రమణ, ఉప్పలగుప్తం ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, అంబటి వెంకటేశ్వరరావు, అంబాజీపేట ప్రెసిడెంట్ వై.వి. గారు, అంబాజీపేట వైస్ ప్రెసిడెంట్ రాము , ఇతర సభ్యులు సురేంద్ర , అయినవిల్లి ప్రెసిడెంట్ చక్రవర్తి , మామిడికుదురు సెక్రటరీ హీరూ , గౌరవ అధ్యక్షులు రామకృష్ణ , గన్నవరం వైస్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సేఫ్టీ ఐడీ స్టిక్కర్ వ్యవస్థ కోనసీమలోని ఫోటోగ్రాఫర్లకు భద్రత విషయంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది.


Your email address will not be published. Required fields are marked *
Comments (2)
15 Jan, 2024
David Malan
Lorem ipsum, dolor sit amet consectetur adipisicing elit. Laudantium quaerat dicta pariatur, distinctio nesciunt.
Reply15 Jan, 2024
David Malan
Lorem ipsum, dolor sit amet consectetur adipisicing elit. Laudantium quaerat dicta pariatur, distinctio nesciunt.
Reply15 Jan, 2024
David Malan
Lorem ipsum, dolor sit amet consectetur adipisicing elit. Laudantium quaerat dicta pariatur, distinctio nesciunt.
Reply15 Jan, 2024
David Malan
Lorem ipsum, dolor sit amet consectetur adipisicing elit. Laudantium quaerat dicta pariatur, distinctio nesciunt.
Reply