DR.B.R.AMBEDKAR KONASEEMA DISTRICT
DR.B.R.AMBEDKAR KONASEEMA DISTRICT
konaseema
2025-06-08
ఇమేజ్ టెక్ డిజిటల్ కలర్ ల్యాబ్ ఘనంగా ప్రారంభం: అమలాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ శివ దుర్గ ఇమేజ్ టెక్ డిజిటల్ కలర్ ల్యాబ్ ను ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు గెడ్డం సురేష్ కుమార్ గారు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కల్వకొలను తాతాజీ గారు, జిల్లా గౌరవ అధ్యక్షులు రామా రెడ్డి గారు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ మనోజ్ గారు, అమలాపురం యూనియన్ గౌరవ అధ్యక్షులు కట్టమూరు కృష్ణ గారు, అమలాపురం యూనియన్ అధ్యక్షులు బాబి గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ శివ దుర్గ ఇమేజ్ టెక్ డిజిటల్ కలర్ ల్యాబ్ యాజమాన్యం మాట్లాడుతూ, తమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అన్ని మండలాల ప్రెసిడెంట్లు, సెక్రటరీలకు, మరియు తమ వ్యాపార అభివృద్ధికి సహకరిస్తున్న ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీతో కూడిన సేవలను అందిస్తామని, ఫోటోగ్రఫీ రంగంలో ఉన్న వారికి మెరుగైన సేవలు అందించి, వారి అభివృద్ధికి తోడ్పడతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Read Morekonaseema
2024-01-04
ది .04-01-2024 డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ శ్రీ హిమాన్షు శుక్లా గారిచే కోనసీమ ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ నూతన వెబ్ సైట్ ను ప్రారంభించడం జరిగింది. అసోసియేషన్ ఏర్పడి నేటికీ ఒక సంవత్సరకాలం ముగిసింది. ప్రమాణస్వీకారం జరిగిన ఇదే రోజున వెబ్ సైట్ ఆవిష్కరించడం దీనికి ముందు లోగా ఆవిష్కరణ లాంటి కార్యక్రమాలు చేపట్టడం మంచి పరిణామం .ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ కొత్త వెబ్ సైట్ డిజైనింగ్ బాగుందని, జిల్లా అసోసియేషన్ కార్యవర్గం ఫోటోగ్రాఫర్లకు చేసే కార్యక్రమాలు వారి ఆలోచనా విధానాలు బాగున్నాయని కొనియాడారు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో కొత్త టెక్నాలజీ అవసరం ఎంతో ఉందని వాటికి అనుగుణంగా తమ వృత్తిని కొనసాగించాలని తెలియజేశారు. జిల్లా అంతా ఒకటే ఐడి కార్డు ఉండేలా ఏర్పాటు చేయడం మంచి ఆలోచన అన్నారు. కొత్త ఐడి కార్డులను సభ్యులకు అందజేశారు జిల్లా లోని ఫోటోగ్రాఫర్లకు కావాల్సిన అన్ని సహకారాలు అందజేస్తానని అన్నారు. జిల్లా ప్రెసిడెంట్ గెడ్డం సురేష్ కుమార్ మాట్లాడుతూ ఈ నూతన వెబ్సైట్ వలన జిల్లాలోని ప్రతి ఫోటోగ్రాఫర్ ను ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసి డిజిటల్ ఐడి కార్డ్ ఇవ్వడం జరుగుతుందని ఫోటోగ్రాఫర్ల సమస్యలను పరిష్కారం చేయడం సులభం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గెడ్డం సురేష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ మనోజ్, పి.ఆర్. ఓ. సత్య ప్రసాద్, జిల్లా మెంబర్ రాజేష్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రమణ, అమలాపురం అసోసియేషన్ ప్రెసిడెంట్ నగేష్, గౌరవ అధ్యక్షులు చింతపల్లి శీను, కొత్తపేట అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏడుకొండలు, నామాల వెంకటేశ్వరరావు , అయినవిల్లి ప్రెసిడెంట్ ప్రకాష్, అంబాజీపేట ప్రెసిడెంట్ గిరి ట్రెజరర్ ప్రతాప్ ,కె.గంగవరం ప్రెసిడెంట్ సుబ్రమణ్యం, సెక్రటరీ శ్రీనివాస్, ఉప్పలగుప్తం ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు సెక్రటరీ భవాని శంకర్ పాల్గొన్నారు.
Read Morekonaseema
2024-11-01
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ మీటింగ్ ముక్తేశ్వరం నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ గెడ్డం సురేష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇటీవల కోనసీమ జిల్లా కలెక్టర్ శ్రీ హిమాన్షు శుక్లా గారిచే ప్రారంభించిన ఫోటోగ్రాఫర్ల నూతన వెబ్ సైట్ యొక్క ఉపయోగాలు, సభ్యుల ఐడి కార్డులు ఎలా నమోదు చేసుకోవాలి అనే విషయాలపై వివరణ ఇవ్వడం జరిగింది. అనంతరం అమలాపురం మండల ప్రెసిడెంట్ నగేష్ మాట్లాడుతూ జిల్లా అంతటికీ ఒకే ఐడి కార్డ్ ఉండటం వలన సభ్యులు ఏ మండలం వారైనా ఆ మండల కార్యవర్గంతో కలిసి వారి సమస్యలను తెలుసుకోవడం వారికి కావాల్సిన సహకారం అందించడం సులభం అవుతుందని తెలియజేశారు. అనంతరం జిల్లా ప్రెసిడెంట్ సురేష్ కుమార్, అమలాపురం మండల ప్రెసిడెంట్ నగేష్,అయినవిల్లి మండల ప్రెసిడెంట్ ప్రకాష్ జిల్లా మెంబర్ రాజేష్ , కృష్ణ మరియు మాజీ ప్రెసిడెంట్ చక్రి గార్లను సత్కరించారు.
Read More