THE PROFESSIONAL PHOTOGRAPHERS & VIDEOGRAPHERS WELFARE ASSOCIATION
DR.B.R.AMBEDKAR KONASEEMA DISTRICT

WELCOME TO THE KONASEEMA PHOTOGRAPHERS AND VIDEOGRAPHERS WELFARE ASSOCIATION!
ప్రొఫెషనల్ ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్

డా|| బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా

Regd : 24 /2023

ఆంధ్ర కేరళ గా పేరొందిన ఈ కోనసీమప్రాంతం 2014 లో రాష్ట్ర విభజన తరువాత ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. చుట్టూ పచ్చని పంటపొలాలు, కొబ్బరి తోటలు, పరవళ్ళు తొక్కే పిల్లకాలువలతో కనువిందు కలిగించే ప్రాంతం మా కోనసీమ. ఈ కోనసీమ ఫొటోగ్రఫీ రంగంలో ఎంతో అభివృద్ధి చెందింది. ఈ జిల్లా డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేరు తో ఏర్పడింది. ఈ జిల్లాలో సుమారు 1500 మంది ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. 22 మండలాలతో ఉన్న ఈ జిల్లా 16 అసోసియేషన్ లు కలిగిఉన్నవి. అప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ పోసిన వీరేంద్రకుమార్(బుజ్జి)గారు మరియు వారి కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కోనసీమ జిల్లా ప్రత్యేక అసోసియేషన్గా 2023 జనవరి 3వ తేదిన ప్రొఫెషనల్ ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసిషన్ పేరుతో 24/2023 నెం.తో రిజిస్ట్రేషన్చేసి ఏర్పాటు చేయడమైనది. నూతనంగా ఏర్పడిన ఈ జిల్లా అసోసియేషన్ కు మొదటి అధ్యక్షుడుగా శ్రీ గెడ్డం సురేష్ కుమార్ ప్రమాణస్వీకారం చేయడమైనది. వీరి ఆధ్వర్యంలో 16 అసోసియేషన్ల నుండి వారి సభ్యుల అంగీకారంతో 17మంది సభ్యులను ఎన్నుకుని వారిచే ఈ జిల్లా అసోసియేషన్ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయించడం జరిగింది. ఈ అసోసియేషన్ కు మండపేట కు చెందిన ఫొటోమేజిక్ వెంకట్ గారు రూపొందించిన కొత్త లోగోను 2023 ఏప్రియల్ 23వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పినిపే విశ్వరూప్ గారిచే ఆవిష్కరించడం జరిగింది. మొత్తం 18 మంది సభ్యులతో ఈ అసోసియేషన్ కొత్త ఆలోచనా విధానాలతో ముందుకుసాగుతోంది.

konaseeema

Welcome to the Konaseema Photographers and Videographers Welfare Association!

DR.B.R. AMBEDKAR KONASEEMA DISTRICT

Empowering Creativity, Nurturing Talent, Ensuring Well-being.

Our mission is to promote the welfare and interests of our members, advocating for fair working conditions, providing resources for skill development, and fostering a sense of camaraderie within the community. We strive to be a guiding force, ensuring the well-being of our members both professionally and personally.